Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ
విద్యాసంస్థలు ప్రారంభించాలి
అ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిó బి.వీరభద్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వం తక్షణమే జీఓ నెంబర్ 4 రద్దు చేసి, ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిó బి.వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర్టంలో విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులు ప్రకటించి, విద్యా సంస్థలను మూసివేయటం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్య అన్నారు. జి.ఓ.4 రద్దుచేసి వెంటనే విద్యా సంస్థలను ప్రారంభించాలనీ, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అవసరమైతే ఒక మండలమో ఒకటి, రెండు విద్యా సంస్థలు మూసివేయవచ్చునని తెలిపారు. కరోనా నిబంధనలను ప్రతిసారి 10 రోజులపాటు పొడగిస్తున్న ప్రభుత్వము, విద్యా సంస్థలకు మాత్రము రెండు వారాలపాటు సెలవులు ప్రకటించటము సరైంది కాదన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన సామాజిక తరగతులకు చెందిన విద్యార్థులు విద్యా ప్రమాణాలలో బాగా వెనుకబడ్డారన్నారు. కరోనా తీవ్రత కాస్త పెరిగిందంటే వెంటనే విద్యా సంస్థలను మూసివేయటం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర పరీక్షల ఫలితాల ఆధారంగానైనా విద్యార్థులు చదువుల్లో ఏ స్థాయిలో ఉన్నారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించారు. విద్యారంగంపై అశ్రద్ధ వహిస్తున్న ప్రభుత్వం,కరోనా సాకుతో మూసివేయడంలో ఉత్సాహం ప్రదర్శిస్తుందన్నారు.