Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
అ జునుమాల మల్లేష్ ప్రధమ వర్ధంతి సందర్భంగా అల్పాహార పంపిణీ
నవతెలంగాణ-కొత్తగూడెం
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి సామాజిక సేవలో కమ్యూనిస్టు కార్యకర్తలు ముందుండాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపు నిచ్చారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మల్లేష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా పాత కొత్తగూడెం ప్రాథమిక వైద్యశాల నందు కరోనా టెస్టులకు వచ్చినవారికి అల్పాహార పంపిణీ చేయడం జరిగింది. ముందుగా మల్లేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ముందుచూపుగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయడంలో వైఫల్యం చెందాయని విమర్శించారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రజా పోరాటాలతో పాటు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నామని మొదటి దఫా రెండో దఫా కరోనాలో సైతం జిల్లాలోని అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు కమ్యూనిస్టుల పనిలో భాగంగా నిత్యం ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, మల్లేష్ సోదరులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జనుమాల నగేష్, జునుమాల రమేష్, కెహెచ్ ప్రసాద్, గాజుల రాజారావు తదితరులు పాల్గొన్నారు.