Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గొత్తికోయలకు రేడియోలు, సోలార్ లైట్లు పంపిణీ
అ కార్యక్రమంలో సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు
దుమ్ముగూడెం : సామాజిక సేవా కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ శాఖ ముందుంటుం దని సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు మారుమూల గొత్తికోయ వలస గిరిజన గ్రామమైన మానుగట్టు గిరిజనులకు రేడియోలు, సోలార్ లైట్లు అందజేశారు. మొత్తం 40 రేడియోలతో పాటు 20 సోలార్ లైట్లు సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రేవతితో కలసి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రేడియో ప్రసారాల ద్వారా వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చాన్నారు. పోలీసులు అందిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరు విధిగా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ తప్పని సరిగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో ఎమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరించే విదంగా చూస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎప్ జవాన్లతో పాటు పోలీసులు పాల్గొన్నారు.