Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
మనోవికాసానికి బాటలు వేయడంతోపాటు సమా చార అధ్యయనం, మహనీయుల జీవిత గాథలను తెలుసుకునేందుకు ఉపయోగపడే గ్రంథాలయాలు నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు చైతన్యం నూరిపోసిన గ్రంధాలయాలు నేడు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అలంకారప్రాయం గా మిగులుతున్నాయి. నిత్యం పాఠకులతో కళకళలాడే ఈ గ్రంథాలయాలు నేడు క్రమేణా పాఠకులకు దూరం అవుతున్నాయి. దీంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత భవనాలు లేక, అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో, రెగ్యులర్ సిబ్బంది లేక, కనీస వసతులు లేక పోవడంతో విజ్ఞానాన్ని అందిం చాల్సిన గ్రంధాలయాలు వెలవెలబోతున్నాయి. తొర్రూరు డివిజన్ పరిధిలో ఏడు మండలాలు ఉండగా పెద్దవంగర, నర్సింహులపేట, గంగారం మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాట చేయలేదు. జిల్లాలో 14 గ్రంథాలయాలు ఉండగా తొమ్మిది గ్రంథాలయాల్లో గ్రంథ పాలకులు, అటెండర్ పోస్టులు ఇన్చార్జిలే ఉన్నారు. తొర్రూరు, దంతాలపల్లి, మరిపెడ మండ లాల్లో భవనాలు ఉన్నప్పటికీ అవి సరిపోవటం లేదు. నెల్లికుదురులో అద్దె భవనంలో, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో ఉన్న గ్రంధాలయాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. తొర్రూరులో గ్రంథాలయంలో గ్రంథాలకు ఇన్ఛార్జి కావడంతో వారానికి మంగళ, బుధ రెండ్రోజులు మాత్రమే పుస్తక విభాగం తెరుస్తారు. మిగిలిన రోజుల్లో మూసివేస్తారు. ఒక పత్రికా విభాగం మాత్రమే తీసి ఉంటుంది. దీంతో వచ్చిన పాఠకులు తిరిగి కి వెళ్ళిపోతున్నారు. గతంలో పనిచేసిన అధికారిని జనగామ జిల్లాకు బదిలీ చేయగా దంతాలపల్లి గ్రంథపాలకునిగా ఇన్చార్జిగా నియమించారు. ప్రస్తుతం కేవలం దిన పత్రికల తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత పుస్తకాల దర్శనమిస్తూ ఉండడంతో వచ్చే వారు కూడా రావడం మానేశారు. వెంటనే అధికారులు పాలకులు స్పందించి పోటీ పరీక్షల పుస్తకాలు, కాంపిటీటివ్ పుస్తకాలు అందుబాటులోకి తేవాలని పాఠకులు నిరుద్యోగులు కోరుతున్నారు. స్థానిక గ్రంథాలయానికి సొంత భవనం ఉన్నా అది సరిపోవడం లేదు. భవనం ముందు పార్కింగ్ స్థలం లేకపోవడంతో వచ్చిన వాహనాలన్నీ అడ్డంకిగా మారుతున్నాయి. గతంలో మూడు వందల మంది పాఠకులు ప్రతిరోజు వచ్చేవారు. ప్రస్తుతం 100 మంది మాత్రమే వస్తున్నారు. రెండో అంతస్తు వేస్తే సౌకర్యంగా ఉంటుందని, అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.