Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
35వ డివిజన్లోని సమస్యలను స్థానికులు మేయర్ నీరజ దృష్టికి తీసుకురాగా ఆమె వెంటనే స్పందించారు. మోతీనగర్ నివాసులు మురికి కాల్వ సమస్యను మేయర్ దృష్టికి గతంలో తీసుకువచ్చారు. స్పందించిన మేయర్ ఈఈ ఇరిగేషన్ మరియు రెవెన్యూ సంబంధించిన అధికారులను క్షేత్రస్థాయిలో నక్షా ఆధారంగా పరిశీలించారు. దిగువకు నిలువ ఉన్న నీరు పోవుటకు పాత పంటకాలవను జెసిబీల ద్వారా కచ్చ కాలువ కొట్టి నీరు దిగువకు పోయేలా చర్యలు చేపట్టారు. ఏళ్లతరబడి ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే అడిగిన వెంటనే చర్యలు చేపట్టి పరిష్కార మార్గం తెలిపిన మేయర్‌కి, మంత్రికి, స్థానిక కార్పొరేటర్‌కు స్తానికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సిపిఎం కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు, తెరాస కార్పొరేటర్ మాటేటి అరుణ, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.