Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
వైరా నియోజవర్గం లోని ఏజన్సీ మండలమైన కారేపల్లిలో అన్ని హంగులతో వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు విన్నవించారు. ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే రాములునాయక్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం ఫలికారు. అనంతరం కారేపల్లిలో వంద పడకల ఆసుపత్రి అవశ్యకతను వివరించి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ఆసుపత్రికి హామీ ఇచ్చారు.