Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
అనుభవదారులుగా ఉంటూ భూమిని సాగు చేసుకుంటున్న రైతులమైన తమకు కాకుండా అనర్హులైన వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నారని కాళ్లు అరిగేలాగ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నామని మధిర శాసన సభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కను మధిర క్యాంపు కార్యాలయంలో కలిసి తమ గోడును భూ బాధితులు వెళ్లబోసుకున్నారు. ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని రైతులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా రైతులు తమకు ఉన్న సమస్యను వివరిస్తూ జమలాపురం గ్రామ రెవిన్యూ పరిధిలో గల సత్యనారాయణపురం గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 58లో 382 కుంటల భూదాన భూమి కలదని, గత కొన్ని శతాబ్దాలుగా సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన రైతులమైన తాము అనుభవంలో ఉండి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగి స్తున్నామని తెలిపారు. కొంతమంది వ్యక్తులు సా గులో ఉన్న రైతులకు కాకుండా సాగులో లేని వారికి పైరవీలతో పట్టాదారు పాసు పుస్తకాలను ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారికి ఇప్పిస్తున్నారని, నిజమైన రైతులం నష్టపోతున్నామని ఆరోపించారు. సాగు చేసుకుంటూ అనుభ వంలో ఉన్న వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని తమ ఆవేదనను తెలుపు కున్నారు. ఈ సందర్భంగా భట్టి రైతులతో మాట్లాడుతూ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి సాగులో ఉన్న రైతులెవరూ నష్టపోకుండా సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని రైతులకు భట్టి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దో మందుల సామేలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎర్రు వెంకట్రావు, బండారు నరసింహారావు, కడియం శ్రీనివాసరావు, రాజీవ్ గాంధీ, రైతులు పివి కృష్ణారావు, శివ నాగేశ్వరరావు, ఆత్మ ప్రసాద్, ఆర్ శ్రీనివాసరావు, అయ్యప్ప స్వామి, ఆర్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.