Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
సత్తుపల్లి నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలను చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ తెలిపారు.శుక్రవారం మండల పరిధిలోని కోర్లగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎండీవో బైరెడ్డి మనోహన్‌రెడ్డి సంభాని చంద్రశేఖర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలపై భారాలు మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని అన్నారు. కార్యక్రమంలో సత్తుపల్లి సభ్యత్వ నమోదు ఇన్చార్జి యలమంచిలి శ్రీనివాసరావు, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దగ్గుల రఘుపతిరెడ్డి, చండ్రుగొండ జెడ్పీటీసీ వెంకటరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పాందయ్య, కల్లూరు, పెనుబల్లి, వెంసూర్ మండలాల అధ్యక్షులు పెద్దబోయన .దుర్గప్రసాద్, చెలికని రాజబాబు, చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిటీసిలు కొండూరు కిరణ్ కుమార్, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.