Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీష్‌రావు
నవతెలంగాణ- కల్లూరు
శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు పున నిర్మాణం చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. భవనాలను, మందుల స్టాక్ రూమ్‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వ ఆస్పత్రి భవనాల నిర్మాణాలు చేపట్టాలని పలు సమస్యలతో కూడన వినతిపత్రంను మంత్రి హరీష్‌రావుకు అందజేశారు. వినతిపత్రంలో కల్లూరు మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల హాస్పటల్‌గా మార్చడం జరిగిందని, కావున నూతన బిల్డింగ్‌ను మంజూరు చేయాలని, మౌలిక సదుపాయాలను నూతన ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేయాలని, తల్లాడ మండలం సత్తుపల్లి, కొత్తగూడెం ప్రధాన దారులకు అనుసంధానంగా ఉండటం చేత తరచూ రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్న వారి కోసం తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు సేవలు అందించాలని, తల్లాడ మండలంలో కుర్నవల్లి నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పాలని, పెనుబల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనం శిథిలావస్థకు చేరినందున నూతన భవనాన్ని మంజూరు చేయాలని, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన రహదారికి సమీపాన ఉన్నందున ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర చికిత్స అందించడం కొరకు ఏర్పాటు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనం చుట్టూ ప్రహరీ గోడ నెలకొల్పాలని, అడవిమల్లెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సదుపాయాలను నెలకొల్పాలని, వేంసూరు మండలంలో బీరాపల్లి నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పాలని, వెంసూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజరు కుమార్, టిఆర్ఎస్ మండల అద్యక్షులు పాలెపు రామారావు, ప్రభుత్వ వైద్యులు డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాములు, డా,, సత్య చైతన్య, రై.స.స. ప్రతినిధులు డా,, లక్కినేని రఘు, పసుమర్తి చంద్రరావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, జడ్పీ,మండల కో ఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, కమ్లి, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్ప ప్రసాద్ , యూత్ మండల అద్యక్షులు పెడకంటి రామకష్ణ, నాయకులు రాచమళ్ళ నాగేశ్వరరావు, ఉబ్బన వెంకటరత్నం, సర్పంచ్ లు మోహన్ నాయక్, మేకల కష్ణ, అజ్మీరా జమలయ్య, పప్పుల రత్నాకర్, కిరణ్, ఏనుగుల అంజి మరియు పలువురు జిల్లా ఉన్నత అధికారులు, జిల్లా, మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.