Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం వేగవంతం చేయాలని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు పొదెం వీరయ్య అన్నారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త పట్టువీడని దీక్షతో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి పార్టీ బలోపేతానికి తోడ్పడాలని ఆయన తెలిపారు. సభ్యత్వం నూరుశాతం చేసి ఏజెన్సీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి నల్లపు దుర్గాప్రసాద్, ఎంపీపీ గీద కోదండ రామయ్య, జెడ్పీటీసీ ఇర్పా శాంత, ఎంపీటీసీలు ముత్యాల స్వాతి, మడకం పద్మజ, వార్డు సభ్యులు సరియం రాధా, ఎం.సత్యనారాయణ, కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి, విజయ నాయుడు, సురేష్, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.