Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
మండల పరిధిలోని గండి ప్రొలు సీతయి గూడెం పంచాయతీని ఐక్యరాజ్య సమితి పర్యావరణ ఆడిటింగ్ బృందం శుక్రవారం సందర్శించింది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ రైతులకు అదనపు ఆదాయంగా కార్బన్ ప్రోత్సాహకాలను అందించే ప్రధాన ఉద్దేశ్యంతో తెలుగు రాష్ట్రాల్లో కార్బన్ క్రెడిట్ మీద పనిచేస్తున్న పయనీర్ అసోసియేషన్ నేతృత్వంలో జీకేఎఫ్ ఆగ్రో ఫారెస్ట్ సంస్థ అనే విషయం అందరికీ తెలిసించేనని సంస్థ నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో జి.ఎఫ్ సంస్థ వివిధ బృందాలతో చేసుకుంటున్న ఒప్పంద పాత్రలను తనిఖీ చేయడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్బన్ క్రెడిట్ నమోదు కార్యక్రమం, రికార్డుల నిర్వహణ పనితీరు పట్ల బృందం ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆడిటింగ్ ప్రక్రియను పూర్తిచేశారు. పంచాయతీ సర్పంచ్ సుధీర్ మాట్లాడారు. టెక్నికల్ విభాగాధిపతి వంశీకృష్ణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ సమన్వయకర్తలు లక్ష్మినారాయణ, ఎర్రా కృష్ణ, సంస్థ సభ్యులు రజియాబేగం, లలిత, దుర్గా ప్రసాద్, రవితేజ పాల్గొన్నారు.