Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సామూహిక లైంగిక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్యదర్శి డి.సీతా లక్ష్మి మాట్లాడుతూ రోజు రోజుకు లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆమె ఆరోపించారు. మహిళలపై ఈ దాడులు ఆగాలంటే ముందు మద్యం నిలిపి వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళందరిని కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు నాదెళ్ల లీలావతి, పి.లక్ష్మి కాంతం, పి.దేవి, ఇంద్రజ, నాగ లక్ష్మి పాల్గొన్నారు.