Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కార్మిక సంఘాలు హైద్రాబాద్లోని ఆర్ఎల్సి వద్ద సింగరేణి యాజమాన్యం యూనియన్లకు మధ్య 61 సంవత్సరాల వయస్సు పెంపుదలపై స్టాండింగ్ ఆర్డర్స్ మార్పు విషయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడుతూ మూడు రోజుల సమ్మె సందర్భంగా పెట్టిన డిమాండ్ పరిష్కారాన్ని వాయిదా వేస్తూ ఈ సమావేశం ముందుగా నిర్వహించటం ఎంతవరకు సమంజసమని ముందు ఆ తేదీ నిర్ణయించిన తర్వాత ఈ సమావేశం నిర్వహించడం సమంజసమన్నారు. దానిపై మిగతా సంఘాలు కూడా స్పందించిన మేరకు ఆ సమావేశాన్ని పూర్తి చేయటానికి ఫిబ్రవరి 4న తప్పకుండా సమావేశం ఏర్పాటు చేస్తామని యజమాన్యం తెలియజేసింది. దాని తర్వాత 61 సంవత్సరాలకు కొన్ని సంఘాలు రాత పూర్వకమైన సమ్మతిని తెలియజేశాయి. మిగితా సంఘాలని 15లోపు తమ అభిప్రాయాన్ని చెప్పాలని ఆర్ఎల్సి తెలిపారు. దీనిపై 61 సంవత్సరాలు పెంచటం వల్ల ఉత్పన్నమైన ప్రధాన సమస్యలు సీఎంపిఎఫ్, పెన్షన్, లీవ్ల తీవ్ర సమస్యలు వీటన్నింటిపై మేనేజ్మెంట్ ఆటంకాలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సీఎంపిఎఫ్, పెన్షన్ విషయంలో ఇప్పటికే ట్రస్ట్ బోర్డులోకి లెటర్స్ రాయటం జరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ దగ్గర కూడా చర్చించడం జరిగిందని వీటిపై తొందరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని యాజమాన్యం తెలియజేసింది. లీవుల పై అడిగిన ప్రశ్నకు కోల్ ఇండియాలో అమలు చేస్తున్నారు కాబట్టి సింగరేణిలో మేము అమలు చేస్తున్నామని మేనేజ్మెంట్ చెప్పిన దాని పై సిఐటియు నాయకులు స్పందిస్తూ కోల్ ఇండియాలో ఏకపక్షంగా యూనియన్ల అభిప్రాయం తీసుకోకుండా అమలు చేస్తున్నారని అది సరైనది కాదని దాన్ని తీసుకొచ్చి సింగరేణి అమలు చేయడం ఎంతవరకు సమంజసమని కోల్ ఇండియాలో యూనియన్ అగ్రిమెంట్ అయిన వాటిని అమలు చేయదు కానీ కోల్ ఇండియాలో అగ్రిమెంట్ జరగని వాటిని అమలు చేయడంలో అతి ఉత్సాహం చూపిస్తుందని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. అందుకనే ఈ అంశాలపై సిఐటియు తన వైఖరిని రెండు రోజుల్లో ఆర్ఎల్సీకి, మేనేజ్మెంట్ కి తెలియజేయు నున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమా న్యం తరపున జిఎం పర్సనల్ అందెల ఆనంద రావు, డీజిఎం హనుమంతరావు, పిఎం అశోక్, యూనియన్ తరపున టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, ఎఐటియుసి నుండి రాజకుమార్ , ఐఎన్టీయూసీ నుండి సంపత్ ,హెచ్ఎంఎస్ నుండి రియాజ్ అహ్మద్, సీఐటీయూ నుండి మంద నరసింహా రావు, బి ఎంఎస్ నుండి కారం సత్తయ్య, ఐఎఫ్టి యూ, ఇతర సంఘాల నుండి నాయకులు పాల్గొన్నారు.