Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విచ్చలవిడిగా చికెన్, మటన్ వ్యర్థాలపై అధికారులు ఆరా
నవతెలంగాణ-పినపాక
మణుగూరు టు ఏటూరునాగారం ప్రధాన రహదారి వద్ద గల ఉప్పాక బ్రిడ్జి వద్ద ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులోని చికెన్ షాపు దుకాణదారులు, చేపలు అమ్మే వారు వ్యర్థాలను ఉప్పాక బ్రిడ్జి కింద పారబోయడం, పాడయిపోయిన కూరగాయలను పారబోయడంతో ఆ ప్రాంతం అంతా వ్యర్థాలతో నిండిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో కొందరు విషయాన్ని యంపీపీ గుమ్మడి గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన శుక్రవారం ఉప్పాక బ్రిడ్జి పరిసరాలను పరిశీలించి ఈ బయ్యారం క్రాస్ రోడ్లో దుకాణదారులపై, పవర్ ప్లాంట్ ఉద్యోగస్తులు వేస్తున్న చెత్త చెదారంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పాక బ్రిడ్జి ప్రాంతంలో అక్కడి వ్యర్థాలను తొలగించాలని సంబంధిత పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. ఆ ప్రాంతంలో వ్యర్థాలను పారబోస్తున్న దుకాణదారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించాలని ఆదేశించారు.