Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐ బి.అశోక్
నవతెలంగాణ-చర్ల
నానాటికీ అభివృద్ధి చెందుతున్న నేటి తరానికి సాంకేతిక పరిజ్ఞానం అనివార్యమని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.అశోక్ అన్నారు. గురుదేవ్ విద్యాలయం చర్ల నందు పాఠశాల యాప్‌ను ఆయన లాంచనంగా ప్రారంభించారు. అదే విధంగా స్టూడెంట్ పోర్టల్‌ను చర్ల ఎస్సై రాజు వర్మ, టీచర్ పోర్టల్‌ను ఎస్సై వెంకటప్పయ్య ప్రారంభించారు. గురుదేవ్ విద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడారు. మన ప్రాంతంలో స్కూల్ పేరుతోనే ప్రత్యేకమైన యాప్ తేవడం ఎంతో గొప్ప విషయమని, ఇంత చక్కటి సాంకేతిక పరిజ్ఞాన్ని అందుబాటులోకి తేవడం చాలా అభినందనీయం అని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ, విద్యార్ధులు చక్కగా ఉపయోగించుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ నందు కూడా పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సై రాజు వర్మ మాట్లాడుతూ విద్యార్ధులు విద్యతో పాటు గొప్ప వ్యక్తుల జీవత చరిత్రలు చదవటం, విలువలతో కూడిన సుగుణాలను అలవరుచుకోవాలని అన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దొడ్డ ప్రభుదాస్ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులకు చదువుతో పాటుగా వివిధ రంగాలలోని ప్రముకులతో ప్రత్యేక కార్యక్రమాలు చేయ్యాలని సూచించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన స్కూల్ హెడ్ మాస్టర్ గిరి వెంకట ప్రసాద్ మాట్లాడుతూ చర్లలో మొదటిసారిగా పూర్తి స్థాయి డిజిటల్ విధ్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చిన గురుదేవ్ విద్యాలయం కరోనా కష్ట కాలంలో కూడా ఏకలవ్య లెర్నింగ్ యాప్ వారి సహకారంతో మా గురదేవ్ విద్యాలయం పేరుతో ఒక యాప్‌ని రూపొందించి గూగుల్ ప్లే స్టోరే నుండి విద్యార్థిని విద్యార్ధులకు అందుబాటులోకి తేచ్చినట్టు తెలియజేశారు. మన ప్రాంతంలో ఈ విధంగా సొంత యాప్ కలిగిన ఏకైక విద్యాసంస్థ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా స్కూల్ అకాడెమిక్ కోఆర్డినేటర్ యం.వి.సుబ్రహ్మణ్యం వ్యవహరించారు.