Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నేడు ప్రారంభించనున్న రాష్ట్ర ఆర్ధిక, వైద్యశాఖ మంత్రి
హరీష్ రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మించిన మాతా, శిశు సంరక్షణ నూతన ఆసుపత్రిని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం ప్రారంభించనున్నారు. మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు 14వ నెంబర్ ఏరియాలో సుమారు రూ.18 కోట్లతో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అధునాతన సాంకేతిక పరికరాలు సమకూర్చుకొని 100 పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. సుమారు 17 ఎకరాలలో సువిశాలమైన వాతావరణంలో నిర్మించిన మాతాశిశు సంరక్షణ ఆస్పత్రి ప్రారంభంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన, ఆదివాసి, బడుగు బలహీన వర్గాల గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం, మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.