Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,
షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ- నేలకొండపల్లి
నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాలలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పేదవాడి ఇంటికి కాలినడకన స్వయంగా వెళ్లి వివిధ గ్రామాలలో 29 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను అందజేశారు. గ్రామస్తులు, లబ్ధిదారులు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వయంగా తన ఇంటికి వచ్చి చెక్కులను అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. మండలంలోని కోరట్ల గూడెం, కోనాయి గూడెం, ఆచర్లగూడెం, గువ్వల గూడెం, ముజ్జుగూడెం, అనాసాగరం, సదాశివపురం గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆప్యాయంగా పలకరిస్తూ వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమన్నారు. అనంతరం సదాశివ పురం గ్రామంలో ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఉన్నం బ్రహ్మయ్య, ఎన్నబోయిన శ్రీను, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, రైతుబంధు సమన్వయ సమితి మండల కన్వీనర్ శాఖమూరి సతీష్, సిడిసి చైర్మన్ నెల్లూరు లీలాప్రసాద్, నాచేపల్లి సొసైటీ చైర్మన్ తన్నీరు సత్యనారాయణ, నేలకొండపల్లి సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు బచ్చలకూరి జ్యోతి, పెంటమల్ల పుష్పమ్మ, రేగురి శ్రావణ్ కుమార్, పాపినేని కరుణశ్రీ, యాతాకుల లక్ష్మి, ఎంపీడీవో కే జమాల్ రెడ్డి, తాసిల్దార్ దార ప్రసాద్, నాయకులు నంబూరి సత్యనారాయణ, అనగాని నరసింహారావు, మంకెనపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.