Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా
కార్మికవర్గం పోరాడాలి
అ ఇఫ్ట్యూ జాతీయ నాయకులు టి.శ్రీనివాస్
నవతెలంగాణ-ఇల్లందు
దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను దశలవారీగా నిర్వీర్యం చేస్తూ ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని పరిరక్షణకు కార్మికులు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని, ఇఫ్టు జాతీయ నాయకులు టి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఇఫ్ట్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్లన్న భవనంలో ఆదివారం జిల్లాసదస్సు ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న మహా రత్న ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీకి అప్పగించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. కార్మిక రంగా 150 ఏళ్ల పాటు పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు ప్రైవేటీ కరణ కారణంగా కార్మికులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 23, 24 తేదీలలో జరగబోయే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ సదస్సులో రాష్ట్ర సహాయ కార్యదర్శి రామయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, షేక్ యాకుబ్ షావలి, జిల్లా ఉపాధ్యక్షులు సంజీవ్, మధుసూదన్ రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.