Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పర్యటనలు కాదు...ప్రజల
ప్రాణాల విషయమాటేమిటి...?
అ సీపీఐ(ఎం) సీనియర్ నేత
కాసాని, జిల్లా కార్యదర్శి
కనకయ్య విమర్శ
నవతెలంగాణ-కొత్తగూడెం
దళితులంటే ఎందుకు అంత అలుసని, మంత్రుల పర్యటనలు కాదు, ప్రజల ప్రాణాల విషయమాటేమిటని, మర ణించిన వారిపై ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని సీపీఐ(ఎం) సీనియర్ నేత కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఘాటుగా విమర్శంచారు. తిపనపల్లి రోడ్ వద్ద సింగరేణి బొగ్గు లారీ ప్రమాదంలో మరణించిన వారికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.1లక్ష అందించాలనీ వారు ప్రభు త్వాన్నీ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ(ఎం) అధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగ వారు మట్లాడుతూ ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసమేనని, ప్రజలకు అండగా నిలవని ప్రభుత్వం, అధికారులు సరైన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది హెచ్చ రించారు. రోజూ కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న దళితులు ప్రమా దంలో మరణిస్తే, మానవతా దృక్పథంతో సరైన ఆర్ధిక సహాయం చేయకపోగా, మంత్రులకు, ప్రజా ప్రతినిధులు పరామర్శించే సమయమే లేకపో యిందని ఘాటుగా విమర్శించారు. ఇదేనా దళితుల పట్ల ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. ఓట్ల రాజకీయాలకు ప్రజ లు కావాలి కానీ, ప్రాణాలు పోతే ఓదా ర్పుకైన రాని పాలకులకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. కంటి తుడుపు చర్యల వల్ల దళితులకు ఎటువంటి న్యాయం జరగ దనీ అన్నారు. ప్రభుత్వము వెంటనే స్పం దించి మరణించిన కుటుంబానికీ తక్షణ మే ఆర్ధిక సహాయం అందించాలని డిమా ండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, పట్టణ నాయకులు జూనుమల నగేష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.