Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఆదివాసీ కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రామచంద్రయ్య దంపతులకు బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావులు ఆదివారం శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, టీఆర్ఎస్ నాయకులు భూపెల్లి నర్సింహారావు, శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాలయ్య, ఉద్యమకారులు నరేందర్, రామారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.