Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సాధించి పెట్టిన మహౌన్నత వ్యక్తి గాంధీజీ అని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస రావు అన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్లోని గాంధీజీ విగ్రహానికి కొత్వాల పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ ప్రాణత్యాగం ఫలితంగా దేశానికి స్వాతంత్రం సాధించామని గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా భారతీయులందరూ అహింసా సిద్ధాంతాలను పాటిస్తూ సన్మార్గంలో పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, వర్తక సంఘం అధ్యక్షులు పెండ్యాల కృష్ణ మూర్తి, చలువాది ప్రకాష్, బ్యాంకు చారి, సునీల్, కుమార్ సార్, వీరబాబు, వెంకటేశ్వర్లు, ఉమా శంకర్, సంధు ప్రభాకర్, దేవీప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.