Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ట్రెంచ్‌లు కొట్టడం ఆపాలి
అ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలి
అ ఎంపీపీ ముక్తి సత్యం
నవతెలంగాణ-ఇల్లందు
జీవనోపాధి కోసం పోడు చేసుకుంటున్న భూముల్లో అటవి సిబ్బంది మొక్కలు వేయడం నిలిపివేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు, ఎంపీపీ ముక్తి సత్యం, డివిజన్ సహాయ కార్యదర్శి తుపాకులు నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని పోలారంలో పార్టీ మండల నాయకులు చింత ఉదరు అధ్యక్షతన పోడు రైతుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. వారు ప్రసంగింస్తూ పోడు భూములకు పట్టాలు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నెరవేర్చ లేదన్నారు. ఇంతవరకూ ఏ ఒక్కరికీ పట్టాలి ఇవ్వలేదని, అనేక ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములు అక్రమంగా గుంజుకుని ట్రెంచ్‌లు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అనేక ఏళ్లుగా ఆదివాసీలు, గిరిజనులు పేదలు సాగుచేసుకుంటున్న పోడుభూములకు పట్టాలి వ్వాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ వారి దోపిడీ దౌర్జన్యాలను నిలుపుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్డీ మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, ఐఎఫ్టియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కు సారంగపాణి, టేకులపల్లి మండలం నాయకులు ఎట్టి నరసింహారావు, పోలారం సర్పంచ్ సరోజిని, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు నరసింహారావు, నాయకులు పాల్గొన్నారు.
టేకులపల్లి : గత రెండు రోజులుగా గుండాల మండలంలో నతూరుబాక, మమకన్ను, ముత్తాపురం, పెద్దతోగు తదితర గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో పోడు భూముల్లో దౌర్జన్యంగా ట్రెంచ్ కొట్టడం చేస్తున్నారని, వెంటనే నిలుపుదల చేయాలని న్యూ డెమోక్రసీ కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు పోడుభూముల్లో ట్రేంచు కొట్టడం నిలుపుదల చేసి, పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యకర్మంలో మండల నాయకులు బాణోత్ వెంకట్రావ్, సకృ, సజ్జన్, శంకరాచారి, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.