Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
అమరుల త్యాగం మరువలేనిదని, వారందరి ప్రాణత్యాగం వల్లనే మనందరం స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశపు హాలులో స్వాతంత్య్ర సముపార్జనలో ప్రాణ త్యాగం చేసిన అమరుల త్యాగాలను మననం చేసుకునేందుకు ఉదయం 11 గంటలకు 2నిమిషాలు మౌనం పాటించు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళిఅర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ వర్ధంతిని భారత ప్రభుత్వం దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల జ్ఞాపకార్ధం రెండు నిమిషాలు మౌనం పాటించాలని సూచించినట్లు చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించన వీరుల త్యాగాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ స్వర్ణలత, ఏఓ గన్యా, ఎల్ఏ పర్యవేక్షకులు రాజేంద్ర ప్రసాద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.