Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే గాంధీజీకి అసలైన నివాళి అని, గాంధీ అహింసా మార్గం అన్ని సమస్యలకు పరిషా రం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్‌కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 74వ వర్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించారన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం గాంధీ విధానాలను అనుసరిస్తూనే గాడ్సే విగ్రహాలను ప్రోత్సాహిస్తుందన్నారు. బీజేపీలో గాడ్సే వారసులు ఎక్కువగా ఉన్నరన్నారు. రాహూల్‌గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసేంతవరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీన్, ఎండి.షబానా, మహిళా అధ్యక్షురాలు రమణ, ఐఎన్టియూసి ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్, సీనీయర్ కాంగ్రెస్ నాయకులు నర్సయ్య, నవీన్, పాల్గొన్నారు.