Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
రోటరీ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో ఆదివారం కోవిడ్ సమయంలో వివిధ రంగాలలో తమ విధులను నిర్వర్తించిన ఐదుగురికి వొకేషనల్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సునీల్, లాల్ ఖాన్, ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకట రావు, హెల్త్ డిపార్ట్ మెంట్ రమాదేవి, గ్రామ పంచాయతీ బాధ్యులు శ్రీనివాస రావులను సన్మానించి సత్కరించారు. భద్రాచలంలోని టౌన్ హౌజ్ ప్యామిలీ రెస్టా రెంట్లో వొకేషనల్ అవార్డ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు కోట మధుసూదనరావు, కార్యదర్శి చలపతి రావు, కోశాధికారి విద్యాసాగర్, కాబోయే రోటరీ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి, కాబోయే అధ్యక్షులు వసంతరావు, అసిస్టెంట్ గవర్నర్ నాగేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.