Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రోగాల భారీన ప్రజలు
నవతెలంగాణ-మణుగూరు
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మణుగూరు సబ్‌డివిజన్‌లో పారిశ్రామికీకరణ కారణంగా గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి. సింగరేణి ఉపరితల గనుల కారణంగా భూగర్భజలాలు అడుగంటాయి. సామాన్యులకి తాగేందుకు మంచినీరు అందుబాటులో లేవు. సింగరేణి గ్లోబల్ కంపెనీ వ్యర్థ జలాలు సారపాక బీపీఎల్ కంపెనీ వదిలే మురుగునీరు గోదావరిలో కలుస్తున్నాయి. దానికి తోడు ఈ ప్రాంతానికి మణిహారమైన బీటీపీఎస్ యాష్ పాండ్స్ పూర్తికకాముందే 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అధిగమించి ఉత్పత్తి కొనసాగుతుంది. రోజుకు 16 వేల టన్నుల బొగ్గును మండిస్తున్నారు. దీనికి తోడు వాతావరణ కాలుష్యంతో పాటు మిగులు యాష్ నీళ్ళను గోదావరిలోకి వదులుతున్నట్టు ప్రజలు తెలుపుతున్నారు. గోదావరి నీరు తాగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మిషన్బగీరథ నీరు అంతంత మాత్రంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషనుభగీరథ నుండి వచ్చే నీరు తాగడానికి వీలు లేకుండా మురుగు, బురదనీరు వదులుతున్నారు. ఈ నీరు తాగి ప్రజలు టైఫాయిడ్, వైరల్ జ్వరాలు భారీన పడుతున్నామని ప్రజలు తెలుపుతున్నారు. మిషనుభగీరథ నీరు తాగలేమంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఆదివాసులకు చెలిమలు, వాగు నీళ్లకు పరిమితమ వుతున్నారు. మణుగూరు మండలంలో 14 గ్రామపంచా యతీలలో ప్రత్యామ్నాయ తాగే నీటి వనరులు లేక మినరల్ వాటరును తాగేందుకు ఆశ్రయిస్తున్నారు. ప్రజల బలహీ నతలను ఆసరాగా తీసుకోని బుగ్గ పంచా యతీ మినహా, అన్ని గ్రామ పంచాయతీలలో పుట్టగ ోడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్స్, సరైన అనుమతులు లేకుండా నెలకొల్పుతున్నారు. మినరల్ వాటర్ కారణంగా ప్రజలు ఆర్దికంగా ఇబ్బంది పడుతున్నారు.
వాటర్‌ప్లాం ట్లలో సరైనటువంటి పరిశీలన లేక, సిబ్బంది లేక ఇష్టానుసారంగా మినరల్ వాటర్‌కు జనరల్ వాటరును సరఫరా చేస్తున్నారు. దాదాపుగా మినరల్ వాటర్ క్యాన్లలో నాచు, ఇతరత్ర వ్యర్థ పదార్థాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజలు ఏ నీరు తాగాలో, ఏ నీరు తాగకూడదో ఆయోమయ స్థితిలో ఉన్నారు. మిషనుభగీరథ కారణంగా గతంలో ఉండే ప్రత్యామ్నాయ తాగునీటి సౌకర్యాలు అంతరించిపోయాయి. పేదవారు మినరల్ వాటర్ కోనుక్కోని తాగే పరిస్థితి లేక, మిషన్Ûగీరథ వాటరును తాగి రోగాల పాలు అవుతున్నారు. వెంటనే ప్రభు త్వ యత్రాంగం గోదావరి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నారు.