Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సీతానగరం అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చే నెల 3వ తేదీన జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కరపత్రాలను భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పొదేం వీరయ్య ఆదివారం ఆవిష్క రించారు. భద్రాచలం క్యాంపు కార్యాల యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరయ్య మాట్లాడుతూ అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే ఫిబ్రవరి 3వ తేదీన జరిగే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ తరుణ్ మిత్ర అంబేద్కర్ కమిటీ సభ్యులు ధనగం వంశీ, కొప్పుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.