Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సేవలు మరువలేనివి
అ మున్సిపల్ చైర్మెన్ డివి, సీపీఐ(ఎం), కాంగ్రెస్, టీడీపీ, న్యూడెమోక్రసీ నేతలు
నవతెలంగాణ-ఇల్లందు
కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ సీనియరు నాయకులు ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మెన్ మొల బాబు (63) కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి వారి స్వగృహంలో మృతి చెందారు. భౌతికకాయానికి ఇల్లందుపట్టణ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు దొడ్డ డానియల్, పులి సైదులు, సీనియర్ మాజీ కౌన్సిలర్ సుదర్శన్ కోరి, ఈశ్వర్ గౌడ్ వాసుదేవ్, సుదర్శన్ కోరి, లక్ష్మణరావు, ఆర్ జగన్నాధం, ఐఎన్టీయూసీ నేతలు పూలమాలలు వేసినివాళులర్పించారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పి, ఓదార్చారు.