Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
డాక్టర్ జేవిఎల్.శిరీష
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుమతులు లేకుండా డయాగ్నిస్టిక్ సెంటర్స్, అసుపత్రులలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే ఆయా సెంటర్స్, అసుపత్రులపై చర్యలు తీసుకుంటామని, సెంటర్‌ను సీజ్‌చేస్తామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జేవిఎల్.శిరీష హెచ్చరించా రు. ఆదివారం ప్రకటన విడుదల చేశారు. పాల్వంచలోని రజిత డయాగ్నిస్టిక్ సెంటర్లో అనుమతులు లేకుండా కోవిడ్‌పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. అనుమతులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని తేలినందున సెంటర్‌ను సీజ్‌చేసి, వారికి రూ.10వేలు జరిమాన విధించనుట్లు తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రెండవ దఫా ఫీవర్‌సర్వే....
జిల్లాలో ఇంటింటి రెండవ దఫా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1065 టీములు సర్వే నిర్వహించారు. 17342 ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వేచేశారు. 594 మందికి ఫీవర్, ఇతర జలుబు, దగ్గు లక్షణాలు గుర్తించారు. వారికి 594 ఔషద కిట్లు పంపిణీ చేశారని డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో 83 కోవిడ్ కేసులు...
జిల్లాలో ఆదివారం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో 84 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 1939 టెస్టులు నిర్వ హించగా 84 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. భద్రాచలం డివిజన్లో5 కేసులు, సింగరేణి ప్రధాన అసుపత్రిలో 25 కేసులు, కొత్తగూడెం డివిజన్లో 53 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వారు తెలిపారు.