Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బెడిసిన మావోయిస్టుల వ్యూహం
అ బుర్కపాల్ తరహా పోలీసులపై
దాడికి యత్నం
అ పోలీసుల అప్రమత్తతో తప్పిన ముప్పు
అ 25 కేజీల ఐఈడీ మందుపాతర గుర్తించి
నిర్వీర్యం చేసిన బీడీఎస్ బృందాలు
నవతెలంగాణ-చర్ల
భద్రతా దళాల అప్రమత్తంగా ఉండటంతో జవాన్లకు పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో జవాన్లు ఊపిరి పీల్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని తిమ్మాపురం అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ తర్వాత తిరిగి వస్తుండగా కోబ్రా బెటాలియన్ 201కి పట్టుబడ్డ నక్సలైట్ మడ్కం మడకం బద్రు విచారణలో సంచల నాత్మక విషయాలు వెల్లడించాడు.
ఖంగు తిన్న కోబ్రా దళాలు
పీఎల్జీఏ బెటాలియన్ నెంబర్ ఒకటి భద్రతా బలగాలపై బుర్కాపాల్ దాడి మాదిరిగానే, రహదారి నిర్మాణ సమయంలో దాడికి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసినట్టు బీజాపూర్ జిల్లా తర్రెం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో గాయపడిన మావోయిస్టు మడకం బద్రు తెలిపారు.
భద్రతా బలగాలు ఆపరేషన్‌కు వెళ్లినప్పుడు, మావోయిస్టుల బృందంతో ఎన్కౌంటర్ కారణంగా ప్లాన్ విఫలమైంది. మావోయిస్టులు కమాండర్ కల్లు ఎన్కౌంటర్ నుండి తిరిగి వస్తున్న భద్రతా బృందంపై ఐఈడీని పేల్చే పనిని మిలిషియా కమాండర్ మడ్కం జోగాకు అప్పగించారు. భద్రతా బలగాల అప్రమ త్తతతో భారీ నష్టం జరగకుండా కాపాడుకున్నారు. 25 కేజీల ఐఈడీ మందుపాతరను గుర్తించి అడవి లోనే దానిని నిర్వీర్యం చేయటంతో భారీ ప్రమాదం తప్పింది. జంగిల్ సెర్చ్‌లో విచారణ కోసం అరెస్టు చేసిన మరో నలుగురు అనుమానితులను నిన్న విచా రణ తర్వాత మాత్రమే వారిని విడుదల చేసివారి కుటుంబాలకు అప్పగించారు. అరెస్టయిన మావోయి స్టు మడకం బద్రును కోర్టులో హాజరు పరిచారు.