Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఆసియాలోనే అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి రెండేండ్లకు ఒకసారి కనీవినీ ఎరుగని రీతిలో ఆదివాసీ సాంప్రదాయాలతో అత్యద్భుతంగా జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే అలాంటి జాతరకు వెళ్లేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే! ఫిబ్రవరి 16 నుండి 19 వరకు జరగనున్న జాతరకు ఇప్పటినుండే ప్రజలు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. కొంతమంది సొంత వెహికిల్లలో మరికొంతమంది తమ అవసర నిమిత్తం ప్రయివేటు వెహి కిల్లను వేలకు వేలు కిరాయిలు కట్టి వెళ్తున్న సంగతి తెలిసిందే! కాగా అలా ంటి వారందరికీ అందుబాటులో ఉండే విధంగా టీఎస్ ఆర్టీసీ అన్ని రూట్లలో బస్సులు నడుపుతున్నారన్నది కూడా అక్షర సత్యం. కొత్త గూడెం, ఇల్లందు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా కొత్తగూడెం డిపో నుండి ఇల్లందు, గుండాల, పస్రా మీదు గా మేడారం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసును సోమవారం ప్రారంభించారు. దీంతో గుండాల పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.