Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
కిసాన్ మోర్చా ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘంల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం రైతు విద్రోహదినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీఐటీయూ పట్టణ కన్వీనర్ వై.వి రామారావు అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి, రైతు సంఘం జిల్లా నాయకులు యం.బీ.నర్సారెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక ప్రభుత్వం వ్యవహరించిన కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. సంవత్సరం రోజుల పాటు దేశం నడిబొడ్డున రైతు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచి వేసి అనేక మంది రైతులు చనిపోవటానికి కారణమైందని అన్నారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకోకపోతే కార్మిక కర్షక ఐక్యతతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ పట్టణ నాయకురాలు మర్ల పాటి రేణుక, ఎన్.నాగరాజు, ఎం.వి.ఎస్ నారాయణ రత్నం, లక్ష్మణ్, చేగొండి శ్రీనివాస్, కోరాడ శ్రీనివాస్, రాము, మధు, చాట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.