Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మనస్థాపానికి గురై
గుండెపోటుతో రైతు మృతి
అ ప్రభుత్వం బాధ్యత వహించాలి : ఎన్డీ
నవతెలంగాణ-ఇల్లందు
పోడు భూముల్లో అటవీ అధికారుల ట్రెంచ్‌లు వేయడంతో మనస్థాపానికి గురై గుండెపోటుతో రైతు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...అటవీ అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో ట్రెంచ్‌లు వేయడానికి ఏడిప్పలగూడెం గ్రామాన్ని సందరి ్శంచారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన పోడు రైతు కుంజా రామయ్య (55) సాయంత్రం వరకూ తన పొలం వద్దే ఉన్నాడు. ఇక తన భూమి తనకి దక్కదని భావించిన రైతు మనస్థాపానికి గుర య్యాడు. ఏడు ఎకరాల భూమి బతికేదెట్ల అని మద న చెందుతూ బాధతో ఇంటి ముఖం పట్టాడు. ఇంటి కి వెళ్లి మంచినీళ్లు తాగుతుండగా గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. మృతునికి భార్య, ఆరుగురు కుమారులు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
కుంజా రామయ్య మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : ఎన్డీ నేత ఆవునూరి మధు
మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీ ఏడిప్పలగూడెం గ్రామనికి చెందిన పోడు రైతు కుంజ రామయ్య గుండెపోటుతో మరణించడం బాధాకరం. ఆయన మరణానికి ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు బాధ్యత వహించాలి. రామయ్య కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఇప్పటికైనా ఆదివాసీ, గిరిజన పేదల పోడుభూములను లాక్కునే ప్రయత్నాలు ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.