Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఆనారోగ్యంతో బాధ పడుతున్న తమ కుమారుడిని ఆదుకోవాలని భద్రాచలంలోని రాజుపేట చెందిన తల్లి దండ్రులు ఇరువురూ వేడుకు న్నారు. తమ కుమారుడు హర్షవర్ధన్‌కు ఊపిరితిత్తుల వైరస్ సోకి గత పది రోజులుగా బాధపడుతున్నాడని వారు పేర్కొన్నారు. ఈ సమయంలో స్పందించిన వంగవీటి మోహన రంగా భద్రాద్రి కాపు యువసేన ఆధ్వర్యంలో బండారు శ్రీకాంత్ మూడవ వేలు సహాయం సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు బండారు శరత్ బాబు, అసరా సూరిబాబు, ముసునూరి వాసు, న్యాయ వాది అరుణ్ చంద్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.