Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పద్మశ్రీ సకిని రామచంద్రయ్య
సన్మాన సభలో
అ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు, సంక్షేమ
శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
నవతెలంగాణ-మణుగూరు
అంతరించిపోతున్న గిరిజన కళలు జాతులను కాపాడుతూ వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో గొప్ప కృషి జరుగుతుందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు,సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం హైదారాబాద్‌లోని మాసబ్ టాంక్‌లోని నెహ్రూ సెంటీనరి ట్రైబల్ మ్యూజియంలో విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కమిషనర్ క్రిస్టీనా జడ్ చొంగ్తూ పద్మశ్రీ సకిని రామచంద్రయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదివాసి ఇలాంటి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.10 వేలు ఫించను ఇస్తుందన్నారు. డోలికళను గురుకులాల్లో, పాఠశాలలో గిరిజన విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాబురావు, గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణ, కళ్యాణ్‌రెడ్డి, సీతరాంనాయక్, శంకర్రావు, లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.