Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
ఈ నెల 9న సింగరేణి హెడ్ ఆఫీస్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు కార్మికులకు పిలుపు నిచ్చారు. సోమవారం టేకులపల్లిలోని సింగరేణి హైటెక్ కాలనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల జీవో లేదని, వేతన సవరణ జరగడంలేదని, ఒక పర్మినెంటు కార్మికుడికి ఇచ్చేజీతంతో 10మంది కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని, వీరికి ఏ హక్కులు సదుపాయాలు లేవని, ఏడు సంవత్సరాల కెసిఆర్ పాలనలో ఒక్క రూపాయి జీతం కూడా పెంచలేదన్నారు. కెసిఆర్ హామీ ప్రకారం కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 17 డిమాండ్లతో ఫిబ్రవరి 12 ననిరవధిక సమ్మె సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు జయప్రదం చేయాలని సింగరేణిలో అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డి.ప్రసాద్, గుగులోతు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.