Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రజా సంఘాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులకు, 48 చట్టాలను, నాలుగు కోడ్లుగా విభజించి, తీవ్ర నష్టం కల్పిస్తుందని, రైతాంగ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె.రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి యం.జ్యోతి, విమర్శించారు. సోమవారం దేశ వ్యాప్తంగా రైతు విద్రోహ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో, నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాల కారణంగా, రైతులు ఎండనక వాననక, చలిని కూడా లెక్క చేయకుండా కరోనా కాలంలో 365 రోజులు, భీకర పోరాటం తలపెట్టారని, ఇందులో 700 రైతులు, ప్రాణాలు త్యాగం చేశారని, అప్పుడు గానీ ప్రభుత్వం దిగి వచ్చి నల్ల చట్టాన్ని రద్దు చేసిందని, అయినా ఇప్పటికీ కొన్ని డిమాండ్లు పరిష్కరించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, లఖింపూర్ ఘటన బాధ్యతను శిక్షించాలని, మద్దతు ధరకు చట్టం చేయాలని, అమరవీరుల కుటుంబాలకు నష్టపరి హారం చెల్లించాలని, కార్మికులకు, వ్యతిరేకంగా ఉన్న లేబర్ చట్టాలను, వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం రైతాంగ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.వీరన్న, జున్నుమాల నగేష్, ఎర్రగాని కృష్ణయ్య, ఎస్.లక్ష్మి, రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, బి.వీరభద్రం, వెంకటేశ్వర్లు, రాయమల్లు, సమ్మయ్య, నవీన్, విజయలక్ష్మి, సువర్ణ, రోజా తదితరులు పాల్గొన్నారు.