Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మినీ మేడారంగా పేరు గాంచిన మారాయిగూడెం సమ్మక్క, సారలమ్మ జాతర విశిష్టతను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి మారాయిగూడెం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జీ తెల్లం వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన మారాయిగూడెం గ్రామంలో ఈ నెల 22వ తేదీనుండి 26వ తేదీ వరకు జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర హౌత్సవముల వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. జాతర ఉత్సవాలను జిల్లా మంత్రి పువ్వాడ అజరుకుమార్, గిరిజనసంక్షేమశాఖమంత్రి సత్యవతి రాధోడ్ల దృష్టికి తీసుకుపోవడంతో పాటు ఈ నెల 4, 5 తేదీలలో జాతర కమిటీ సభ్యులకు మంత్రి వద్దకు తీసుకు పోతానని ఆలయ కమిటీ వారికి ఆయన హామీ ఇచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జెడ్పీటీసి తెల్లం సీతమ్మ, టిఆర్ఎస్పార్టీ మండల ప్రదాన కార్యదర్శి కణితి రాముడు, ఉపాద్యక్షులు అపకా వీర్రాజు, దేవరబాలలు సోడి శాంతమ్మ, అచ్చమ్మ, కమిటీ సభ్యులు సోడి ధర్మయ్య, అపకా శ్రీను, మడకం వీరభద్రం, ప్రసాద్, రామారావు, అర్జున్ పాల్గొన్నారు.