Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విలువ రూ.2.25 లక్షలు అ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని
నవతెలంగాణ-పినపాక
మండలంలోని రాయిగూడెం సమీప గోదావరి నుండి అక్రమంగా టేకు దిమ్మలు తరలిస్తున్న ట్రాక్టర్లను గుర్తించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని తెలియ జేశారు. సోమవారం అటవీ శాఖ కార్యాలయంలో నింధితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు గోదావరి నది తీరాన రేంజ్ సిబ్బంది గస్తీ చేయగా సోమవారం తెల్లవారుజామున టేకు దిమ్మలతో వస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనపరచుకొని కేసు నిమిత్తం రేంజ్ కార్యాలయంకు తీసుకువచ్చినట్టు తెలిపారు. 14 టేకు దిమ్మెలకు గాను రూ.2.25 లక్షల విలువచేసే అక్రమాలకు పాల్పడిన ఈ బయ్యారం గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, లక్ష్మారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అరుణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గోవర్ధన్, విజయ, రాంబాబు, డ్రైవర్ లతీష్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.