Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అడిగిన వెంటనే రూ.35 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, వైద్యశాఖా మంత్రి హరీశ్‌రావు, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇటీవల నారాయణపురం 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి హరీష్‌రావును సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణము, 5 డయాలసిస్ మిషన్లు మంజూరు, 2 తాగునీటి బోర్లు ఏర్పాటు, ఆర్వో ప్లాంటు ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఎలక్ట్రికల్ వైరింగ్ డిజైన్‌ను ఏర్పాటు చేయమని కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారు. సత్తుపల్లి అభివృధ్ధికి సానుకూలంగా స్పందించిన మంత్రికి, ప్రభుత్వానికి, నియోజకవర్గ అభివృధ్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న శాసనసభ్యులు సండ్రకు ఈ సందర్భంగా నాయకులు కృతజ్ఞతలు తెలిపి వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎస్కె రఫీ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.