Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా వెంచర్లు చేసే రియల్టర్లపై తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీరాజ్ అధికారి, జడ్పీ సీఈవో వి అప్పారావు హెచ్చరించారు. జిల్లాలో కుప్పలుతెప్పలుగా పెరుగుతున్న అక్రమ వెంచర్లు అరికట్టేందుకు గాను కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నేలకొండపల్లి మండలంలోని నేలకొండపల్లి కొత్తకొత్తూరు గ్రామ పంచాయతీలో వెలిసిన అక్రమ వెంచర్ లను ఆయన పరిశీలించారు. వెంచర్లలో గ్రీన్ బెల్ట్ ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ బెల్ట్ లేని స్థలాల హద్దులను ధ్వంసం చేయాలన్నారు. ల్యాండ్ కన్వర్షన్ లేని స్థలాల్లో అక్రమంగా వెంచర్లు చేసిన వారి వివరాలను సేకరించాలన్నారు. కొత్త వెంచర్ లతోపాటు పాత వెంచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలన్నారు. లేఅవుట్ లేని స్థలాలను కొనుగోలు చేసిన వినియోగదారులు నష్టపోతారన్నారు. ఆయన వెంట ఏడి రాము, ఆర్డిఓ రవీంద్రనాథ్, తాసిల్దార్ దార ప్రసాద్, ఎంపీడీవో కే జమాల్ రెడ్డి, సర్పంచులు రాయపూడి నవీన్, కనమర్లపూడి రామకష్ణ, ఈవో రామ్ నరేష్ ఉన్నారు.