Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్‌కు కాంగ్రెస్ నాయకుల వినతి
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ప్రస్తుతం ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ప్రభుత్వ కార్యాలయాలను మండల పరిధిలోని ఎం.వెంకటాయపాలెం గ్రామానికిగానీ, పోలేపల్లి గ్రామానికిగానీ, తరలించాలని కోరుతూ మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం కలెక్టర్ వీపీ. గౌతమ్‌కు వినతిపత్రం అందజేశారు. ఎం.వెంకటాయపాలెం, పోలేపల్లి గ్రామాలు మండలానికి మధ్యలో ఉన్నాయని, అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం పోలేపల్లిలో రహదారి పక్కనే 30 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని అక్కడకు ప్రభుత్వ కార్యాలయాలకు తరలిస్తే బాగుటుందని వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్‌కు వివరించారు. ఎం.వి.పాలెంలో కూడా ప్రభుత్వ భూమి ఉందన్నారు. కలెక్టర్ గౌతమ్ స్పందిస్తూ ప్రభుత్వ భూమిని సర్వే చేసి వెంటనే రిపోర్టు అందజేయాలని ఆర్డీవోను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మద్ది వీరారెడ్డి, కుమ్మరి అంబ్కేడర్, రామయ్య, విజరు కుమార్, రవి, అశోక్, భరత్, అభిలాష్, సూర్యనారాయణ పాల్గొన్నారు.