Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
రాష్ట్రాలను విస్మరిస్తూ ఫెడరల్ సిస్టంను భ్రష్టు పట్టించడంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎంత మాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర సంబంధిత అంశాలపై గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయించడంలో ఉద్దేశ్యపూరితంగా నిర్లక్ష్యం వహిస్తుందని నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు టీఆర్ఎస్ పక్ష నేతలు నామ నాగేశ్వర్రావు, కే.కేశవరావు నేతృత్వంలో ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేనందున... తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉన్నామని చెప్పారు. అనంతరం మధ్యాహ్నాం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్సభ పక్ష నేత నామ మాట్లాడుతూ భారత రాజ్యాంగం హామీనిచ్చిన ఫెడరల్ సిస్టంను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని... విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ద్వజమెత్తారు. దేశంలో అన్ని రాష్ట్రాలు కు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారనీ... తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయకపోవడం పై ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తమకు ఎందుకు ఇవ్వలేదన్నారు. తెలంగాణను కేంద్రం శత్రువుగా చూస్తున్నారని ప్రభుత్వాన్ని ఘాటుగా నిలదిశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపో యిందని వివరించారు. ఉపాధి కల్పనకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల బకాయిలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటు ఐటీఐఆర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వలేదని విమర్శించారు. మిషన్ భగీరథ పథకానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు మంజూరు చేయలేదని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజా సమస్యల పై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని నామ నాగేశ్వర్రావు, కేకే తెలిపారు.