Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
ఈ ఖరీఫ్ సీజన్లో మిర్చి సాగు చేసి తామర పురుగు, నల్లి, పురుగు చీడపీడల వల్ల పంట పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు చెల్లించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్చి పంట వేసి తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆర్డిఒ సూర్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా శివకుమార్ నాయక్, దామాల రాజు, శీలం బ్రహ్మరెడ్డి, కల్లూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు టి.లాలయ్య, మండల కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్రావు, పాశం నాగేశ్వరరావు, నర్సిరెడ్డి, ఆలేటి అప్పారావు, గోసు వెంకటకృష్ణ, రాజుల పాటి రామకృష్ణ, గోపి, వీరేందర్, రవి కుమార్ నాయక్, ఇంటూరి నగేష్, తాళ్ల కృష్ణ, శివ, రామకృష్ణ పాల్గొన్నారు.