Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
టిఆర్ఎస్ కల్లూరు మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ.... కల్లూరు పెద్ద చెరువు కట్టపై గల శివాంజనేయ ఆలయం, దాసాంజనేయ దేవాలయం, శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రం (శివాలయం), శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, టిఆర్ఎస్ మండల అద్యక్షులు పాలెపు రామారావు, రై.స.స మండల కన్వీనర్ డా,, లక్కినేని రఘు, జిల్లా కమిటి సబ్యులు పసుమర్తి.చంద్ర రావు. మాజి ఎంపీపీ అత్తునూరి రంగారెడ్డి, ఎఎం సి వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, జడ్పీ కో ఆప్షన్ యండి .ఇస్మాయిల్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, యూత్ మండల అద్యక్షులు పెడకంటి రామకృష్ణ, నాయకులు మేకల కృష్ణ, రాచమళ్ల నాగేశ్వరరావు, మాజీ సొసైటీ చైర్మన్ పెద్దబోయిన మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ బుర్రి భవాని నరసింహరావు, ఉబ్బన వెంకటరత్నం, సర్పంచ్లు నందిగం ప్రసాద్, గొల్లమందల ప్రసాద్, బైర్ల కాంతారావు, పొట్రూ కిరణ్, ఎంపీటీసీ బాణోత్ బాలు, కొర్రా నరసింహరావు పాల్గొన్నారు.