Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చింతకాని
గాంధీనగర్లో మంగళవారం పట్టపగలు చోరీ జరిగింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి న్యాయవాది మర్రి ప్రకాష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. ఇంట్లో బీరువాలో ఉన్న 95 వేల నగదు రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. సంఘటన స్థలాన్ని క్లూస్ టీం సందర్శించి వేలిముద్రలు సేకరించారు. ఎస్సై లవన్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. సమీపంలోని చికెన్ షాపు నిర్వాహకులు చెప్పిన వివరాల ప్రకారం మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ వాహనంపై వచ్చి ప్రకాష్ ఇంటి పరిసరాల్లో సంచరించినట్లు పేర్కొన్నారు పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు