Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి బోనకల్ యాదవ సంఘం నాయకులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రూ.70 వేల రూపాయలను మంగళవారం అందజేశారు. బోనకల్ మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుడు గద్దె మల్లేశ్వరరావు (35) గత 5 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మల్లేశ్వరరావు కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఆ కుటుంబానికి బోనకల్ భవన నిర్మాణ కార్మికులు, యాదవ సంఘం నాయకులు సమిష్టిగా ఏర్పడి వారి కుటుంబానికి 70వేల రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, బోనకల్ సహకార సంఘం డైరెక్టర్ గంగుల పుల్లయ్య, యాదవ సంఘం నాయకులు బోనకల్ మాజీ ఎంపీటీసీ గంగుల శ్రీనివాసరావు, యాదవ సంఘం నాయకులు గంగుల నాగయ్య, గంగుల కోటేశ్వరరావు, సీఐటీయూ బోనకల్ మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్ ఖాదర్ బాబా (బుజ్జి), భవన నిర్మాణ కార్మికులు గుంటి శ్రీను, గద్దల శ్రీను, షేక్ మీరా సాహెబ్, బంధం గోవర్ధన్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉప్పర శ్రీను తదితరులు పాల్గొన్నారు.