Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 2.77 లక్షల టన్నులకు 4.27 లక్షల
టన్నుల బొగ్గు వెలికి తీత
అ జీఎం మల్లెల సుబ్బారావు
నవతెలంగాణ-ఇల్లందు
2022 జనవరి నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 2.77 లక్షల టన్నులకు గాను 4.27 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 154 శాతంతో అన్ని ఏరియాల కంటే ప్రథమ స్థానంలో నిలిచిందని జీఎం మల్లెల సుబ్బారావు అన్నారు. ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను మంగళవారం తెలిపారు.
. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 44.72 లక్షల టన్నులకు గాను 51.33 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 115 శాతంతో అన్ని ఏరియాలకంటే 64 రోజుల ముందుగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఘనత ఇల్లందు ఏరియాకు దక్కిందని జీఎం అన్నారు. 3.84 లక్షల టన్నుల బొగ్గు రైల్వే మార్గం ద్వారా, 0.57 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా మొత్తం 4.41 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగింది. జనవరి నెలలో 106 రేకుల ద్వారా బొగ్గు రికార్డు స్థాయిలో రవాణా చేసామని తెలిపారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేసి ఇల్లందు ఏరియాను మొదటి స్థానంలో నిలుపుటకు కృషిచేసిన సంబంధిత అధికారులను ఉద్యోగులను, సూపర్వైజర్లను, యూనియన్ నాయకులకు జీఎం మల్లెల సుబ్బారావు ప్రత్యేకంగా అభినందించారు.