Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల ప్రమాద భీమా వర్తిస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన నర్సాపురం, మారేడుబాక, లచ్చిగూడెం, నారాయణరావుపేట, రామకృష్ణాపురం, గంగారం, కొత్తపల్లి, కోయనర్సాపురం గ్రామాలలో పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు లంకా శ్రీనివాసరావు, బైరెడ్డి సీతారామారావు, ఏ బ్లాక్ అధ్యక్షులు రంగారావు, బిబ్లాక్ అధ్యక్షులు రమేష్‌గౌడ్, సోషల్ మీడియా ఇన్చార్జీ తరుణ్మిత్ర, నాయకులు తదితరులు పాల్గొన్నారు.