Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన
దమన కాండ మానుకోవాలి
అ ప్రదర్శన ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష
రాజకీయ పార్టీలు
నవతెలంగాణ-ఇల్లందు
ఏడ్ఫూలగూడెం గ్రామానికి చెందిన పోడు రైతు కుంజ రామయ్య గుండెపోటుతో సోమవారం మరణించారు. ఆయన మరణానికి ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులులే నైతిక బాధ్యత వహించాలని అఖిలపక్ష రాజకీయపార్టీలు మంగళవారం పట్టణ కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఎఫ్డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ఎఫ్డీఓ కార్యాలయ సూపర్డెంట్ ఫారెస్ట్ అధికారికి వినతి పత్రం అందచేశారు. అనంతరం జరిగిన ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు ఆవునూరి మధు, సీపీఐ(ఎం) నాయకులు దేవులపల్లి యాదయ్య, చంద్రన్న వర్గం ఏరియా కమిటీ నాయకులు జడ సీతారామయ్య, సీపీఐ జిల్లా నాయకులు ఏపూరి బ్రహ్మం, టీడీపీ పట్టణ అధ్యక్షులు వంశి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఏనుగుల ప్రకాష్ తదితరులు మాట్లాడారు. కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆదివాసీ, ఇతర పేదల పోడుభూములను లాక్కునే ప్రయత్నాలను విరమించుకోవాలని లేకపోతే భవిష్యత్తులో ఆదివాసీలు తిరగబడితే ఢిల్లీ రైతుల పోరాట స్ఫూర్తితో ప్రగతి గోడలు బద్దలు కొట్టగలరని ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అఖిలపక్ష నాయకులు ఘాటుగా హెచ్చరించారు.
పట్టాల సమస్య తేల్చకుండా ట్రెంచ్‌లు కొట్టడం సరికాదు
విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి
దరఖాస్తులు స్వీకరించి పట్టాల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వ సహకారంతో అటవీ అధికారులు ట్రెంచ్‌లు కొట్టడం సరికాదని మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, మాజీ జడ్పీటీసీ చండ్ర అరుణ అన్నారు. న్యూడెమోక్రసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఫారెస్ట్ అధికారుల దాడులు బెదిరింపులు పోడు భూమి ఆక్రమణల కారణంగా ఆందోళనకు గురై పోడు సాగు రైతు కుంజ రామయ్య మృతి చెందాడు. ఆయన మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పుడుకేసులు, వేదింపుల వల్ల గిరిజన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో నాయకులు వెంకటేశ్వర్లు, భూక్య శివ తదితరులు పాల్గొన్నారు.